మ్యాగీ తినడానికి చూపించిన ఇంట్రెస్ట్ ఇంట్లో చేసిన మసాలా వడ తినడానికి చూపించరు పిల్లలు. ఆ మాటకొస్తే పెద్దవాళ్ళు కూడా మ్యాగీ తినడానికి లొట్టలేసుకుంటారు. ఇక ఫ్రైడ్ చికెన్, మంచూరియా, నూడుల్స్, బర్గర్లు ఇలా junk food అంటే చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అడిక్ట్ అయిపోయాం. వద్దనుకున్న కూడా వదలలేనంతగా తినేస్తుంటాం. దీనికంతటికీ వాటి తయారీలో వాడే ఒకే ఒక ఇంగ్రీడియెంట్ కారణం.
మనం తినే అన్ని జంక్ ఫుడ్స్ లో అజనమోటో అనే సాల్ట్ ను యూజ్ చేస్తారు. ఇది అవసరం లేకున్నా కూడా, నార్మల్ సాల్ట్ వాడే పరిస్థితి ఉన్నా కూడా అజినమోటో సాల్ట్ వాడతారు. మోనో సోడియం గ్లూటినెట్ అనే కెమికల్ ను అజీనమోటో అంటారు. Ajinamoto అనేది జపనీస్ పదం. రుచిగలది అని ఆ పదానికి అర్థం.
అయితే ఈ సాల్ట్ వల్ల కడుపు నిండినాక కూడా ఇంకా తినాలనే కోరిక పుడుతుందట. తరచూ బయట ఫుడ్ తినాలనే ఆలోచన వచ్చేలా చేస్తుంది ఈ అజీనమొటొ. ఈ సాల్ట్ కలిపిన ఫుడ్ రెగ్యులర్ గా తీసుకోవడం వలన జీర్ణ సంబంధిత వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాదులు వస్తాయి. అందుకే ఈ ఫుడ్ పట్ల జాగ్రత్తగా ఉండడం బెటర్.