Telugunewsfly: కొక్కరకొ అనే కోడి కూత మనకు నేచర్ ఇచ్చిన అలారం. మన వాచ్ లో అలారం అయినా మోగకుండా ఉంటుందేమో కానీ కోడి మాత్రం వేకువజామున కూత వేయకుండా ఉండదు. ఇప్పటికి ఊర్లలో కోడి కూతతో నిద్ర లేచే వాళ్లు ఉన్నారు. మరి ఆ కోడికి అంత కరెక్టుగా టైం కు ఎలా కూస్తుంది..?
ఎంత గొప్ప టెక్నాలజీ అయినా ఒక్కోసారి లెక్కతప్పుతుంది. ఎంత టైం పాటించే మనిషి అయినా అతను రొజూ చేసే ఒక పని ఆలస్యం చేయవచ్చు, కానీ కోడి మాత్రం ఏ ఒక్క రొజూ మరువకుండా సరిగ్గా పొద్దు పొడుస్తుండగానే కూత వేస్తుంది. దాని గ్రాహక శక్తి అంత అద్భుతమైనది మరి. ఆ శక్తి వెనుక ఒక సైన్స్ దాగి ఉంది.
కోడికి ఇన్ఫ్రారెడ్ లైట్ పట్ల ఉన్న సెన్సివిటీ తో అది మనకన్నా దాదాపు 45 నిమిషాల ముందు సూర్య కాంతిని చూడగలుగుతుంది. అందుకే అది మనకన్నా ముందుగా అంత కరెక్ట్ గా పొద్దునే కనిపెట్టి కూత వేస్తుంది. మనల్ని మేల్కొల్పుతుంది.