పాలు తాగితే పోషకాలు అందుతాయి అనేది పాత మాట. పాలు తాగితే రోగాలు వస్తాయి అనేది ఇప్పటి మాట. ఒకడు పాలల్లో ఏదో పౌడర్ కలుపుతాడు, మరొకడు యూరియా కలుపుతాడు. ఇవన్నీ తెలిశాక ఏవి మంచి పాలు అని తెలుసుకోలేక కొంతమంది పిల్లలకు పాలను తాగించడమే మానేశారు. కానీ ఇలా ఎన్ని రోజులు ఉండగలం. కల్తీని ఈజీగా, ఇంట్లోనే కనిపెట్టగలిగితే ప్రాబ్లం ఉండదు కదా..
ఇంతకుముందు పాలలో నీళ్ళ శాతం ఎంత ఉందో కనుక్కునే పరికరం మాత్రమే అందుబాటులో ఉండేది. ఇక పాలల్లో కల్తీ జరిగిందా, లేదా అని తెలుసుకోవడానికి ల్యాబ్ వరకు వెళ్లి టెస్ట్ చెపించవలసి వచ్చేది. ఇవన్నీ తెలియక ఇన్ని రోజులు కళ్ళు మూసుకుని ఏవో ఒకటి అని పాలు తగేసాం. లేదా మనేశాం. ఇక ఇప్పుడు ఆ బాధలు లేవు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన DRDL వాళ్లు milk test kit ను తయారు చేశారు. దీని సహాయంతో ఇంట్లోనే పాలను టెస్ట్ చేసుకోవచ్చు. ఇది అన్ని ఈ కామర్స్ సైట్ లలో అందుబాటులో ఉంది. ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉంది.