బ్యాంక్ లో అకౌంట్ కావాలన్నా, లోన్ తీయాలన్నా, ఇన్కమ్ టాక్స్ కట్టాలన్నా అన్నిటికి అవసరమైంది pan card. అలంటి పాన్ కార్డు లో మన పేరు తప్పుంటే అది మన మిగితా ఐడెంటిటీ కార్డు లకు మ్యాచ్ అవకుంటే మనకు కావాల్సిన ఏ ఒక్క పని అవకుండా ఆగిపోతుంది. మరి ఈ వివరాలు సరి చేసుకోవాలంటే మనం ఎవరో ఒక బ్రోకర్ ని హెల్ప్ అడగాల్సిందేనా అంటే.. అవసరం లేదు. మనకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.
- ముందుగా గూగుల్ లో nsdl అని టైపు చేయండి.
- వెంటనే ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అనే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
-
దాని పైన క్లిక్ చేస్తే ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది.
- అందులో అప్లికేషన్ టైప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే.. చేంజ్ ఆర్ కరెక్షన్ పాన్ కార్డు డేటా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి మన వివరాలు ఇవ్వాలి.
- టోకెన్ నెంబర్ జెనెరేట్ అవుతుంది. అది రాసి పెట్టుకోవాలి.
- నెక్స్ట్ ఆప్షన్ కు వెళ్లి అక్కడ మనకు కావాల్సిన స్పెల్లింగ్ లో పేరును మార్చుకుని, దానికి గాను చెల్లించవలసిన రుసుము చెల్లిస్తే సరిపోతుంది.
మారిన వివరాలతో మన పాన్ కార్డు, పోస్ట్ లో మన ఇంటికి వచ్చేస్తుంది.