బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అంటే మాటలు కాదు. అలాంటిది నాని RJ నుండి ఇప్పుడు నేచురల్ స్టార్ వరకు వచ్చేశాడు. స్టార్ అనే ట్యాగ్ ఉన్న ఇప్పటికీ నాని టైర్ 2 హీరోలానే చూస్తున్నారు. కానీ నాని టార్గెట్ మాత్రం వేరేలా ఉంది.
దసరా నుండి నాని స్టైల్ మారింది. అతను మాస్ హీరో గా మారడానికి ఆ మూవీ హిట్టు, దాని కలెక్షన్లు గట్టి బేస్ ను ఇచ్చాయి. ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్బులో చేరాడు. అప్పటినుండి అందరు నాని మాస్ లో మంచి ఫాలోయింగ్ కోసం ట్రై చేస్తున్నాడు అంటున్నారు. కానీ మనోడు ఈ ప్రయత్నం టక్ జగదీష్ నుండే మొదలెట్టాడు కానీ ఆ సినిమా ఫ్లాప్ తో కాస్త వెనక్కు తగ్గాడు.
అయితే టార్గెట్ ను మాత్రం వదల్లేదు పైగా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక టీమ్ తయారు చేసుకుంటున్నాడు. కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి, వారితోనే రిపీట్ మూవీస్ చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ, ఓదెల, శైలేష్ కొలను, శివ నిర్వాణ లాంటి డైరెక్టర్లను తనే ఇంట్రడ్యూస్ చేసి రిపీట్ చేస్తున్నాడు.తనకంటూ కొన్ని స్టోరీస్ రాసేలా చూసుకుంటున్నాడు.
ఇక సొంత ప్రొడక్షన్ ఎలాగూ ఉంది. దానితో పాటు పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రి మూవీ మేకర్స్, దానయ్య, దిల్ రాజు లాంటి వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటెయిన్ చేస్తాడు.అటు జక్కన్న సపోర్ట్, రానా సపోర్ట్ కూడా ఉంది. ఒక హీరో టైర్ 1 లిస్ట్ లోకి రావడానికి కావల్సిన, చేయవలసిన పనులు అన్నీ నాని సైలెంట్ చేసేశాడు. అందుకే నేను ఇటుకలు పేరుస్తున్నాను గోడ కడతాను అన్నాడు. నెక్స్ట్ తను చేసే మూవీ లిస్ట్ చూస్తే natural star నుండి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. Film industry లో స్టార్ హీరోలు అయిన అప్పటి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల నుండి ఇప్పటి అల్లు అర్జున్, ప్రభాస్, నాగ చైతన్య వంటి హీరోలకు ఉన్నట్టు గానే తనకంటూ దర్శకులు, ప్రొడక్షన్ హౌస్ లను ట్రాక్ లో పెట్టాడు. ఇప్పుడు వరుసగా తన టీమ్ తి తన ప్లాన్ తగ్గట్టుగా సినిమాలు చేస్తున్నాడు. ఇక మాస్ హీరో టార్గెట్ రీచ్ అవ్వడమే మిగిలింది