షుగర్ ఉందా..లేదా.. అనేది తెలుసుకోడానికి టెస్ట్ లు చాలానే ఉన్నాయి. కానీ షుగర్ వచ్చేట్టు ఉంది జాగ్రత్త తీసుకోండి ఆని చెప్పడానికి సరైన పరీక్షలు ఏమి లేవు. కాకపోతే కొన్ని లక్షణాలను బట్టి షుగర్ రాబోతుంది, రాకుండా చూసుకోవాలి అని జగ్రతపడొచ్చు.
- సాధారణంగా కొంతమందికి మెడ భాగం లో, సంకలలో చర్మం బాగా నల్లగా ఉంటుంది. అయితే నుండి అలా ఉండకుండా, సడన్ గా నల్లబడడం మొదలైతే చర్మం మనకు షుగర్ రాబోతుంది అని సంకేతాలు పంపుతున్నట్టుగా భావించవచ్చు.
- పులిపిర్లు కూడా షుగర్ వ్యాధికి సంకేతాలు. ఉన్నట్టుండి చర్మం పై పులిపిర్లు పెరుగుతుండడం కూడా మనకు sugar attack అవబోతుందని సిగ్నల్ ఇచ్చినట్టే.
- మొహంపై మొటిమలు రావడం చూస్తూనే ఉంటాం. కానీ వీపు పై మొటిమలు రావడం అరుదు. ఇది కూడా ఒక లక్షణమే.
- ఇక తరచుగా ఉన్నట్టు ఉండి నీరసంగా అనిపించడం, కళ్ళు తిరిగినట్టుగా అవడం వంటి లక్షణాలు ఉంటే కూడా sugar test చేసుకోవాల్సిందే.
- ఒకవైపు మానసిక ఒత్తిడికి గురవుతూ సరిగా ఆహారం తీసుకోకుండానే బరువు పెరగడం కూడా sugar వ్యాధికి సంకేతం.