చిరంజీవి , బాలయ్య, పవన్, మహేష్ లాంటి స్టార్ హీరోల నుండి నిన్న మొన్న వచ్చిన స్టార్ బాయ్ సిద్దు, తేజ సజ్జ వరకు అందరూ 100 కోట్ల కలెక్షన్లు కొట్టి ప్యాన్ ఇండియా సినిమా వైపు చూస్తుంటే… ఆ ఒక్క బడా మాస్ హీరోకు మాత్రం ఈ ఫీట్ అందని ద్రాక్ష లాగే మిగిలిపోయింది. మరి ఎవరా హీరో..
ఒకప్పుడు స్టార్ డమ్ ను 100రోజుల సినిమా తో డిసైడ్ చేస్తే ఇప్పుడు 100 కోట్ల కలెక్షన్లతో లెక్కిస్తున్నారు. కంటెంట్ బాగుంటే సినిమా కు వంద కోట్లు రావడం అనేది చాలా చిన్న విషయంగా మారిపోయింది. కానీ తెలుగు ఇండస్ట్రీ నాలుగు పిల్లర్లలో ఒకరైన అక్కినేని నాగార్జునకు మాత్రం ఇది ఒక డ్రీమ్ గానే మిగిలిపోయింది. మరి నాగార్జున ఇప్పటివరకు కలెక్ట్ చేసిన హయ్యెస్ట్ గ్రాస్ ఎంతో తెలుసా..
నాగ్ లేటెస్ట్ రిలీజ్ నా సామి రంగ సంక్రాంతి బరిలో దిగి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికి కేవల 37 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోయింది అంటే నాగార్జున మార్కెట్ ఎంత వీక్ అయిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఒక్క ఊపిరి సినిమా మాత్రమే 97.7 కోట్లు గ్రాస్ చేసి వంద కోట్లకు దగ్గరగా వెళ్ళింది. కానీ ఆ మార్క్ ను మాత్రం అందుకోలేకపోయింది.
సోగ్గాడే చిన్ని నాయన లాంటి మాస్ అప్పీల్ ఉన్న సినిమాలు కూడా కింగ్ ను 100 కోట్ల క్లబ్ లో కూర్చో పెట్టలేకపోయాయి. ఇక అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఎవరు కూడా ఈ ఫీట్ ను సాధించలేకపోయారు. ఒకవైపు చిరు, బాలయ్య, వెంకీ లాంటి తోటి సీనియర్ హీరోలు అందరూ తమ ఖాతాలో 100 కోట్లు వేసుకుంటే నాగార్జున మాత్రం అడుగు దూరంలో ఆగిపోయాడు. చూడాలి మరి నెక్స్ట్ మూవీతో అయిన రీచ్ అవుతాడేమో…