పుట్టి భూమి మీద పడ్డాక అందరూ పిలవడానికి ఏదో ఒక పేరు ఉండాలి. మన చుట్టూ తిరిగే ప్రతివాడికీ ఏదో ఒక పేరు ఉంటుంది. వాడే ప్రతి వస్తువుకు ఏదో ఒక పేరు ఉంటుంది. అలాగే మనం ఉండే గ్రహానికి కూడా ఎర్త్ అని పేరు ఉంది. కానీ దీన్ని ఎర్త్ అని మొదటగా పిలిచింది ఎవరు. మనం ఉండే ఈ గ్రహాన్ని ఎర్త్ అనాలి అని చెప్పింది ఎవరు..
భూమితో పాటు మిగితా గ్రహాలు అయిన మెర్క్యూరీ , వీనస్, జూపిటర్, మార్స్, యురేనస్, నెఫ్ట్యూన్, ప్లూటో, సాటర్న్ లకు రోమన్లు, గ్రీకులు, ఆ దేశాల శాస్త్రవేత్తలు వాటి ఆకారాలను, రంగును, పురాణ కథలను బట్టి వారి దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నారు. మరి ఎర్త్ అని ఏ దేశస్థులు లేదా శాస్త్రవేత్తలు పేరు పెట్టారు.
నిజానికి ఎర్త్ అనే పేరు ఎవరు పెట్టారు అనే విషయం చరిత్రలో లేకుండా పోయింది. ఫలానా వారు ఎర్త్ అని పేరు పెట్టారు అని చెప్పడానికి సాక్ష్యాలు లేవు. రకరకాల సమయాల్లో వేరువేరు దేశాల్లో వివిధ పేర్లతో పిలవబడింది. ఆంగ్లో సాక్సన్ వారు నేల మరియు మట్టి అనే అర్థాలు వచ్చేలా ఎర్డా , ప్రోటో ఇండో యూరోపియన్ వాళ్లు ఏర్పో, జర్మన్ లు జోర్డ్, ఇలా రకరకాలుగా మారుతూ వచ్చి ఇంగ్లీష్ లో చిన్న భూమి లాంటి స్పియర్ బాల్ ను పిలిచే ఎర్త్ అనే పదంతో పిలవబడుతూ… ఎర్త్ గా మిగిలిపోయింది. సో ఎర్త్ కి పేరు పెట్టినవారు ఎవరో ఎవరికి తెలియకుండా అయిపోయింది.